AP vs Tamil Nadu: తమిళనాడు సీక్రెట్ డేటా ఏపీకి లీక్ అయిందా!

దక్షిణాదిలో వేడెక్కిన AP vs Tamil Nadu Investments పోరు. దక్షిణ కొరియా ఆటో సంస్థలు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏపీకి రాగా..

AP vs Tamil Nadu Investments War and Industrial Development

ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణపై నెలకొన్న తీవ్ర పోటీ విశ్లేషణ

AP vs Tamil Nadu: పెట్టుబడుల పోరు! ఏ రంగంలోనైనా పోటీ తప్పదు. గెలిచిన వారిదే మనుగడ., ఓడిన వారిది నిష్క్రమణ., ఈ డార్విన్ సిద్ధాంతం ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా గాని లేదా జాతీయంగా గాని రంగాలు వేరు కావొచ్చే మోగాని ఈ పోటీ తప్పదు. తాజాగా ఇటువంటి పోటీనే జాతీయ స్థాయిలో అటు తమిళ, ఇటు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొందంటే మీరు నమ్ముతారా. ? తమ ప్రభుత్వాల హయాంలలో తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నిలిపాలనే లక్ష్యంతో పనిచేసే రాష్ట్రాల జాబితాల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు తీవ్రమైన పోటీ నెలకొంది. ఆశ్చర్యం ఏంటంటే ఒకే రంగానికి చెందిన పరిశ్రమలను ఈ రెండు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేయాలంటూ పోటీ పడుతున్నాయి. దాంతో ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య పట్టుదలలు,. ఛాలెంజ్ లు పెరిగిపోతున్నాయి. తమిళ రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఏపీని, ఏపీకి రావలసిన ప్రాజెక్టులు తమిళనాడును ఎంచుకోవడంతో, ఈ రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరికి గుస్సా నెలకొంది. దాంతో ఇప్పుడు ఇద్దరు సీఎంల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలపై ఓ ప్రత్యేక కథనం.

 

● ADVERTISE WITH MK NEWS TELUGU
మీ వ్యాపారం & బ్రాండ్ ప్రమోషన్ కోసం Banner Ads కేవలం ₹99/- మాత్రమే!
వేలాది మంది తెలుగు పాఠకులకు మీ బిజినెస్‌ను నేరుగా చేరువ చేయండి.
Book Now

AP vs Tamil Nadu మధ్య ముదురుతున్న పారిశ్రామిక పోటీ

తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ల మధ్య నెలకొన్న పారిశ్రామిక పెట్టుబడులు వివాదం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రయత్నించే అంతర్జాతీయ పెట్టుబడుల నేపథ్యంలో, తమ దృష్టికి వచ్చిన కంపెనీలను ఆకర్షించడానికి వారికి అనేక రాయితీలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక్కోసారి ఒకే కంపెనీని తమ రాష్ట్రానికి రావాలంటూ రాయితీలతో ఆకర్షిస్తున్న రాష్ట్రాలు, పలు పరిశ్రమలకు ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పారిశ్రామిక అభివృద్ధి విషయంలో నెలకొన్న ఈ తీవ్రమైన పోటీ దక్షిణ భారతదేశంలో ఓ ఆరోగ్యవంతమైన ఆచరణలకు బదులు, వివాదాస్పదంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు పలు రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా ఎదగడానికి ఈ రెండు పొరుగు రాష్ట్రాలు ప్రత్యేక విధానాలు, రాయితీలతో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0 ద్వారా భారీ రాయితీలను అందించాలనే లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వేగవంతమైన అనుమతులు తక్కువ ధరకే భూముల కేటాయింపు వంటి ఆకర్షణలను అందిస్తోంది. విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు 2026 ద్వారా రూ.9.89 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం రూ.9.89 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు దేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తమిళనాడు, దశాబ్దాలుగా నిర్మించుకున్న బలమైన ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ మరియు ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థ లను చూపించి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. చెన్నై, హోసూర్, శ్రీపెరంబుదూర్ వంటి పారిశ్రామిక కారిడార్లు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆ రాష్ట్రానికి ప్రధాన బలాలుగా ఉన్నాయి.

 

ప్రాజెక్టుల మార్పుతో వేడెక్కిన AP vs Tamil Nadu Investments రాజకీయం

దక్షిణ కొరియాకు చెందిన కొన్ని ఆటోమొబైల్ అనుబంధ సంస్థలు, రాయల్ ఎన్‌ఫీల్డ్ విస్తరణ ప్రాజెక్టు తమిళనాడుకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, సత్యవేడు ప్రాంతాలను ఎంచుకోవడంతో పెట్టుబడి పోటీ విధానానికి బీజం పడిందనే వాదనలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ ఆశించిన బ్రెజిల్ ఎలక్ట్రికల్ పరికరాల సంస్థ ‘WEG’ రూ.2,000 కోట్ల ప్రాజెక్టును తమిళనాడులోని ధర్మపురిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీపై రాజకీయ చర్చ కూడా వేడెక్కింది. ఇందులో భాగంగానే పరిశ్రమలు, ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రక్షణ, అంతరిక్షం, డేటా సెంటర్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, సాగునీటి రంగం ఇలా అన్ని అంశాల్లో రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలుగా కనిపిస్తుంది.

ఇప్పటికే సాధించిన పురోగతిని గణాంకాలతో సహా సీఎం చంద్రబాబు వివరించారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఇవి అదనంగా వచ్చినట్లు ఆయన వివరించారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరాయి. ఈ పెట్టుబడులను కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి, ఉపాధి కల్పన దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సదస్సుకు ముందు జూన్ 2024 నుంచి రాష్ట్రానికి రూ. 22.60 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటిలో రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు తదితర అంశాలకు ఆమోదం లభించిందని వివరించారు. మరో రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధమయ్యాయని స్పష్టం చేశారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో సంఖ్యా పరంగా 58 శాతం నిర్మాణ సన్నద్ధత దశకు చేరుకోవడం పారిశ్రామిక ప్రణాళిక అమలులో పురోగతిని సూచిస్తోందని ప్రజెంటేషన్లో వివరించారు.

 

పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో భారీ లక్ష్యాలు

పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. పునరుత్పాదక రంగంలో ఇప్పటికే 114 గిగావాట్ల సామర్థ్యానికి ఆమోదం లభించినట్లు అధికారిక సమాచారం. మరోవైపు సోలార్ వేఫర్ తయారీ రంగంలోనూ భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. 42 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ సామర్థ్యంతో పాటు 53 గిగావాట్ల ఇంగట్ వేఫర్ తయారీ సామర్థ్యానికి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీలో ఏటా రూ.4.20 లక్షల కోట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ రంగాల్లో ఇప్పటికే రూ.31,926 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్లు, అంతరిక్ష రంగంలో మరో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రణాళిక అని ఐదో తరం యుద్ధవిమాన ప్రాజెక్టును కేవలం 36 రోజుల్లో గ్రౌండింగ్ దశకు తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఇప్పుడు మూడు కీలక రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రానికి వెలుగులు నింపే విద్యుత్ రంగం, మరోవైపు అన్నదాతల ఆశలకు ఊపిరి పోసే నీటి పారుదల ప్రాజెక్టులు, ఇంకోవైపు యువతకు ఉపాధి కల్పిస్తూ పరుగులు పెడుతున్న మోటార్ ఆటోమొబైల్ పరిశ్రమ ఏపీలో కరెంట్ కష్టాలు తీరి, మిగులు విద్యుత్ దిశగా అడుగులు పడుతున్నాయా? పోలవరం సహా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? అలాగే, కియా వంటి దిగ్గజ సంస్థల రాకతో ఆటోమొబైల్ హబ్‌గా మారుతున్న మన రాష్ట్రంలో కొత్తగా రాబోతున్న పెట్టుబడులు ఏవి? ఈ మూడు రంగాల్లో జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ ప్రణాళికలు మరియు క్షేత్రస్థాయి వాస్తవాలేంటి? మరోవైపు తమిళనాడుకు రానున్న ప్రాజెక్టులన్నీ ఏపీ కైవసం చేసుకుపోతుందంటూ అక్కడి ప్రభుత్వం గగ్గోలు పెడుతున్న వైనంలో నిజం ఎంతుంది? మరిన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు తాజా వార్తలు పరిశీలిస్తే ఈ అభివృద్ధి ప్రణాళికల పూర్తి చిత్రం స్పష్టమవుతుంది.

 

అమరావతి క్వాంటం వ్యాలీ, పోర్టులు, విమానాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులు

రాష్ట్రంలో 4.6 గిగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో, అమరావతికి అత్యధునిక టెక్నాలజీతో కూడిన సరికొత్త రూపం ఏర్పడనుంది. ఇందుకు గాను 250 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాసియాలో తొలి ప్రాజెక్టుగా అమరావతి క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేసి 2027 ఫిబ్రవరి 3న ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. దేశ పోర్టుల ద్వారా జరిగే సరకు రవాణాలో 20 శాతం వాటాను సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారిక సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు పోర్టులు పనిచేస్తుండగా, వాటి వార్షిక సరకు నిర్వహణ సామర్థ్యం 346 మిలియన్ టన్నులుగా ఉంది. మరోమాటగా చెప్పాలంటే 2025–26లో 209 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. సరకు నిర్వహణలో దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉంది.

రామాయపట్నం పోర్టును 2027 ఏప్రిల్ నాటికి, మూలపేటను జూన్ నాటికి, మచిలీపట్నాన్ని డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల్లో వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం 1.55 కోట్లుగా ఉంది. 2025-26లో 62 లక్షల మంది ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భోగాపురం, అమరావతి, తిరుపతి ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ తొమ్మిది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక రైల్వేస్ విషయానికొస్తే రాష్ట్రం మీదుగా 839 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు 4,415 కిలోమీటర్ల రైల్వే అనుసంధాన ప్రణాళికలు ఇప్పటికే రూపొందాయి. పోర్టులు, పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, రైల్వే మార్గాలను సమన్వయం చేయడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించి, పరిశ్రమలకు మెరుగైన లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

ఇక నీటి ప్రాజెక్టుల విషయానికొస్తే రాష్ట్ర భవిష్యత్తుకు సాగునీరు, తాగునీటి భద్రత కీలకమని తెలిపిన సీఎం చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని వివరించారు. గోదావరి- పెన్నా కావేరీ నదుల అనుసంధానం ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో ఐదు నదులు, నాలుగు రాష్ట్రాలకు జలభద్రత కల్పించాలన్నది తమ ఆలోచనగా వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ వనరులు, పారిశ్రామిక అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 25 రంగాలవారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం తెలిపారు. శ్రీకాకుళంలో కెమికల్ పార్కు, విశాఖపట్నంలో మెడ్ టెక్ పార్కు అనకాపల్లిలో ఉక్కు అనుబంధ పరిశ్రమలతో పాటు అరుదైన ఖనిజాలు, ఏఐ డేటా సెంటర్ల వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 విజన్ ను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

అనంతపురం ఆటోమొబైల్ హబ్‌కు దక్షిణ కొరియా సంస్థల రాక

దక్షిణ కొరియాకు చెందిన మూడు ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థలు క్వాషిన్, సయోన్, ఐవామెట్ తమ పెట్టుబడి ప్రణాళికలను తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకున్నాయి. ఈ మూడు కంపెనీలు ప్రపంచ ప్రసిద్ధ ఆటోమొబైల్ సంస్థలైన హ్యుందాయ్, కియా వాహనాలకు అవసరమైన విడిభాగాలను సరఫరా చేస్తున్నాయి. తొలుత చెన్నై–హోసూర్ పారిశ్రామిక కారిడార్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించిన ఈ కంపెనీలు చివరకు అనంతపురం జిల్లాను ఎంచుకోవడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇప్పుడు మరింత ముదిరింది.

దీనిపై వివరణలు కోరడంతో రాష్ట్ర ప్రభుత్వ వేగవంతమైన అనుమతుల ప్రక్రియ, పారదర్శకమైన పరిపాలన, పరిశ్రమలకు అందిస్తున్న సహకారం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక ఈ మూడు సంస్థలు కలిపి అనంతపురం జిల్లాలో రూ.1,614 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా రాయలసీమ ప్రాంతంలోని యువతకు 1,418 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందే వారితో పాటు పరోక్షంగా అనేక కుటుంబాలకు ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) కీలక పాత్ర పోషించినట్లు అధికారిక సమాచారం.

అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా గుర్తింపు వచ్చింది. కియా పరిశ్రమ చుట్టూ ఇప్పటికే విడిభాగాల సరఫరాదారులు, రవాణా సంస్థలు, అనుబంధ వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మరో మూడు దక్షిణ కొరియా కంపెనీలు పెట్టుబడులు పెట్టనుండటంతో ఈ పారిశ్రామిక వ్యవస్థ మరింత విస్తరించనుంది. ఒక పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థకు అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే అనుబంధ పరిశ్రమలు సమీప ప్రాంతాల్లో ఏర్పడితే ఉత్పత్తి వ్యయం, రవాణా సమయం తగ్గడంతో పాటు స్థానికంగా పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతాయి. కియా పరిశ్రమకు ఇప్పటికే ఏర్పడిన సరఫరా వ్యవస్థకు ఈ మూడు కంపెనీల రాక మరింత బలాన్ని అందించనుంది.

 

తమిళనాడుకు దక్కిన బ్రెజిల్ ‘WEG’ రూ.2,000 కోట్ల ప్రాజెక్టు

ఇక తమిళనాడు విషయానికొస్తే, దక్షిణ భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఒక ప్రముఖ తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ను కాదని, తమిళనాడులో రూ. 2,000 కోట్ల భారీ పెట్టుబడితో తమ నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో ఈ యూనిట్ ఏర్పాటుపై పరిశీలన జరిపినప్పటికీ, చివరకు తమిళనాడు ప్రభుత్వం అందించిన రాయితీలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసు అనుకూలతల కారణంగా ఆ రాష్ట్రం వైపు మొగ్గు చూపినట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

దక్షిణాదిలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. విశాఖపట్నం సీఐఐ సదస్సు వేదికగా ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్న తరుణంలోనే, రూ. 2,000 కోట్ల విలువైన ఈ బ్రెజిల్ ప్రాజెక్టు తమిళనాడు చేతికి చిక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నూతన తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా తమిళనాడులో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆటోమొబైల్, ఇంజనీరింగ్, తయారీ రంగాల్లో తమిళనాడుకు ఉన్న బలమైన పారిశ్రామిక వాతావరణం, పోర్టుల అనుసంధానత మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత వల్లే అంతర్జాతీయ సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆర్థిక, పారిశ్రామిక రంగ విశ్లేషకుల అభిప్రాయం.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ముందడుగు

దక్షిణ భారతదేశంలో ఇప్పుడు రాజకీయ వేడి కంటే… పారిశ్రామిక పోటీ సెగలే ఎక్కువగా కనిపిస్తున్నాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు దక్షిణాదిలో పెట్టుబడులకు చిరునామాగా ఉన్న తమిళనాడుకు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గట్టి పోటీనిస్తోంది. సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ఏపీ సాధించిన భారీ పెట్టుబడులు, తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోతోందని తమిళనాడు విపక్షాలు గగ్గోలు పెడుతుంటే… ‘మేం ఎవరినీ లాక్కోవడం లేదు, మా రాష్ట్రంలో ఉన్న అనుకూలతలే పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి’ అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

మొదటగా విద్యుత్ రంగం, రెండోది నీటిపారుదల, పారిశ్రామిక నీటి వసతి, మూడోది మోటార్, ఆటోమొబైల్ రంగం రాష్ట్రాల రెవెన్యూకు కీలకంగా మారిన ఈ ప్రాజెక్టులన్నీ ఏపీలోనే ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు కుదరడం, మరోవైపు తమిళనాడు ఏపీ పై గుర్రుగా ఉండటం, ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి వాతావరణం ఏర్పడబోతుందనేది పలువురి వాదనలు పలు రకాలుగా వినిపిస్తున్నాయి. ఇక ఈ పోటీలో అత్యంత కీలకమైనది ఆటోమొబైల్ రంగం. అనంతపురంలోని ‘కియా మోటార్స్’ విస్తరణ కోసం ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవ్వడం, తమిళనాట ప్రాజెక్టుల విషయంలో తమిళనాడుకు మింగుడుపడటం లేదు. మరోవైపు, బ్రెజిల్‌కు చెందిన ఎలక్ట్రికల్ మోటార్ల దిగ్గజం ‘WEG’ సంస్థను తమ రాష్ట్రంలో నిలుపుకోవడానికి తమిళనాడు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటేనే ఏపీ పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ మరో విషయం మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే కాకుండా, పారిశ్రామిక మరియు ఇంధన రంగంలో ఒక పవర్‌హౌస్‌గా మారుతోందనడంలో సందేహం లేదు. ఒకవైపు… రూ.21,838 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ మరియు సాగునీటి భూముల్లో 877 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రణాళికలతో రాష్ట్రం ఇంధన స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు… రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్నదాతలకు భరోసా లభిస్తోంది. ఇక పారిశ్రామిక రంగంలో చూస్తే… కియా ఇండియా ప్రకటించిన 2 బిలియన్ డాలర్ల భారీ విస్తరణ, అనంతపురంలో దక్షిణ కొరియా ఆటో విడిభాగాల సంస్థల రూ.1,614 కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్‌గా మారుస్తున్నాయి. విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా కుదిరిన ఒప్పందాలు, రూ.17 లక్షల కోట్లకు పైగా గ్రౌండింగ్ దశకు చేరిన ప్రాజెక్టులు ఏపీ యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలను మోసుకొస్తున్నాయి. అధికారిక పారిశ్రామిక ప్రోత్సాహకాలు మరియు పెట్టుబడి వివరాలను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మొత్తానికి… ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నినాదంతో ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, మౌలిక వసతులు, భూ కేటాయింపులు దక్షిణాది పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. మరి AP vs Tamil Nadu Investments పోటీలో ఏపీ ఇంకెన్ని భారీ ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి!