BJP Alliance: దేశ రాజకీయాల్లో సంచలనం.. కలిసిన పాత దోస్తీ!

పంజాబ్ రాజకీయాల్లో కీలక మలుపు. ఆరేళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపిన BJP Akali Dal Alliance. 2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఎన్డీయే వ్యూహరచన పూర్తి వివరాలివే.

BJP Alliance Reunited Ahead of Punjab Assembly Elections 2027

ఆరేళ్ల విరామం తర్వాత 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మళ్లీ ఎన్డీయే గూటికి చేరిన శిరోమణి అకాలీదళ్

BJP Alliance: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని అందరికి తెలుసు. అవసరాన్ని బట్టి దోస్త్ మేర దోస్త్ అంటూనే.. అవసరం తీరాక పంతం నీదా నాదా సై అంటూ కాలు దువ్వుతుంటారు.. ఇవన్నీ సర్వసాధారణం. ఇదే కోవలోనే ఆరేళ్ల తరువాత పాతమిత్రులు మళ్లీ చేతులు కలిపారు. ఈసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. టార్గెట్ 2027 అంటూ వ్యూహరచన మొదలుపెట్టారు. మరి ఆ పాతమిత్రుల కల నెరవేరుతుందా? లక్ష్యఛేదనలో వ్యూహాలు ఫలిస్తాయా? ఇంతకీ ఎవరా పాతమిత్రులు..? ఏంటా వ్యూహం

BJP Alliance: ఆరేళ్ల కిందట విడిపోయిన బంధం

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎవరు ఎవరితో కలిసిపోతారో అసలు ఊహించలేం. అందుకే పేరుమోసిన రాజకీయ పండితులు సైతం పాలిటిక్స్ ను అంచనా వేయలేరు. అలాంటి పరిణామమే తాజాగా పంజాబ్ లో చోటు చేసుకుంది. ఆరేళ్ల కిందట విడిపోయిన శిరోమణి అకాలీదళ్ పార్టీ మరోసారి ఎన్డీయే (NDA Alliance) గూటికి చేరింది. కేంద్రహోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో అకాలీదళ్ అధినేత సుఖ్ వీర్ సింగ్ బాదల్ ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి అకాలీదళ్ మొదటి నుంచి ఎన్డీయే (BJP) మిత్రపక్షంగానే ఉంటూ వచ్చింది. ఎన్డీయే కూటమి ఆవిర్భావం నుంచి నమ్మకమైన మిత్ర పక్షంగా ఉంది. కానీ, 2020 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఈ బంధానికి బీటలు వారేలా చేశాయి. పంజాబ్ రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన అకాలీదళ్, కేంద్ర మంత్రివర్గానికి గుడ్ బై చెప్పి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి 2026 వరకు ఈ రెండు పార్టీల దారులు వేర్వేరుగా సాగుతూ వచ్చాయి. దూరమైనా తరువాత ఎన్డీయే కూటమిపై తీవ్రమైన విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసింది అకాలీదళ్.

● ADVERTISE WITH MK NEWS TELUGU
మీ వ్యాపారం & బ్రాండ్ ప్రమోషన్ కోసం Banner Ads కేవలం ₹99/- మాత్రమే!
వేలాది మంది తెలుగు పాఠకులకు మీ బిజినెస్‌ను నేరుగా చేరువ చేయండి.
Book Now

ఈ రెండు పార్టీలు తెగతెంపులు చేసుకున్న తరువాత.. ఎంతలా నష్టపోయాయంటే.. 2022లో జరిగిన ఎన్నికల్లో అకాలీదళ్ మూడంటే మూడే సీట్లకు పరిమితమైతే.. బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితం అయింది. పిల్లులు రెండు పోట్లాడుకుంటే.. కోతి వచ్చి రొట్టె ఎత్తుకెళ్లినట్లు.. బీజేపీ, అకాలీదళ్ మధ్య వైరంతో ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడింది. 117 స్థానాలకు గాను ఏకంగా 92 సీట్లు గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా దర్జాగా అధికారాన్ని చేపట్టింది. దీంతో అటు కేంద్రాన్ని ధిక్కరించి రైతుల మద్దతు దక్కక.. ఇటు అధికారాన్ని చేజిక్కించుకోక.. రెంటికి చెడ్డ రేవడిలా అయింది అకాలీదళ్ పరిస్థితి. అటు బీజేపీ (BJP) పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోకపోయినా కాషాయ పార్టీ.. 18 శాతం ఓటు షేర్ సొంతం చేసుకోగలిగింది. మరోవైపు ఒక్క సీటు మాత్రమే సొంతం చేసుకున్న అకాలీదళ్ ఏకంగా ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పట్టు కోసం చూస్తున్న బీజేపీ ఒకవైపు.. పట్టు నిలుపుకోవాలని చూస్తున్న అకాలీదళ్ మరోవైపు. అప్పటినుంచి సరైన సమయం కోసం చూస్తున్న ఈ రెండు పార్టీలు సరిగ్గా 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపి అకాలీదళ్ (NDA Alliance) చేతులు కలపడం సరికొత్త సమీకరణలకు తెరలేపింది. అయితే ఆరేళ్ల తరువాత ఈ రెండు పార్టీలు ఒకటవ్వడం వెనుక వ్యూహాత్మక ప్రణాళిక ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు.

మరిన్ని తాజా జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ వార్తలు ఇక్కడ చూడవచ్చు.

Read also: AP BJP Alliance: కూటమిలో బీజేపీ ఒంటరైందా?

ఆ ఓటు బ్యాంకే ప్రధాన లక్ష్యం

పంజాబ్ రాజకీయాల్లో అకాలీదళ్‌కు గ్రామీణ ప్రాంతాల్లోని సిక్కు, రైతు వర్గాల్లో బలమైన పునాది ఉంది. మరోవైపు బీజేపీకి పట్టణ ప్రాంతాల్లోని హిందూ ఓటర్లు, వ్యాపార వర్గాల్లో మంచి పట్టుంది. ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు ఏకమైతేనే, అధికార ఆప్ మరియు కాంగ్రెస్‌లను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. అలాగే సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ మధ్య చీలిపోతే అది అంతిమంగా అధికార పార్టీకే లాభం చేకూర్చే అవకాశం లేకపోలేదు. అందుకే అటు బలమైన ఓటు బ్యాంకును కోల్పోకుండా అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఒకేతాటిపైకి తీసుకొచ్చే వ్యూహంతోనే ఇరు పార్టీలు ఏకమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రెండు పార్టీలు ఏకమవ్వడంతోనే అయిపోలేదు. సమస్యసమస్య ఇప్పుడే మొదలైంది. అకాలీదళ్, బీజేపీ(BJP) ల మధ్య అసలు సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతుంది? ఒకవేళ గెలిస్తే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఎవరికుంది..? అనేదే ఇక్కడ అసలు సమస్య..

 

BJP Akali Dal Alliance లో సీట్ల కేటాయింపు, సీఎం అభ్యర్థిత్వంపై అమిత్ షా హింట్

గతంలో పంజాబ్‌లో అకాలీదళ్ 94 స్థానాల్లో, బీజేపీ కేవలం 23 స్థానాల్లో పోటీ చేసేవి. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరిగిన నేపథ్యంలో, 2027 ఎన్నికల్లో బీజేపీ సుమారు 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో, గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనేది కూడా అమిత్ షా హింట్ ఇచ్చేశారు. పొత్తులో పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తే.. వారే ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పేశారు. అలా చూస్తే సింహభాగం అకాలీదళ్ కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే గెలుపు, అధికారం సంగతి అటుంచితే.. ఈ రెండు పార్టీల మధ్య సమన్వయము ఎంతవరకు ఫలిస్తుంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే గత ఆరేళ్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న బీజేపీ, అకాలీదళ్ క్షేత్రస్థాయి కార్యకర్తలు ఇప్పుడు కలిసి పనిచేయడం ఇరు పార్టీల నాయకత్వానికి సవాలుగా మారే అవకాశముంది. అలాగే 2020-21 లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై.. పంజాబ్ లో ఇప్పటికీ ఎంతో కొంత ప్రతికూలత ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, అకాలీదళ్ మిత్రుత్వాన్ని రైతు సంఘాలు ఎలా స్వాగతిస్తాయనేది కూడా ప్రశ్నార్థకమే. అయితే బీజేపీపై ఉన్న రైతు వ్యతిరేక ముద్రను తగ్గించుకోవడానికి అకాలీదళ్ వంటి రైతు నేపథ్యం ఉన్న పార్టీ ఎన్డీయేలో చేరడం బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. అలాగే ఇప్పటివరకు నాలుగు ముక్కలుగా ఉన్న పంజాబ్ ఎన్నికల పోరు, ఇప్పుడు ఆప్, కాంగ్రెస్ మరియు ఎన్డీయే మధ్య త్రిముఖ పోరుగా ఉండనుంది. పంజాబ్ ఎన్నికల ఓటు శాతం మరియు గత ఫలితాల అధికారిక వివరాల కోసం సందర్శించండి భారత ఎన్నికల సంఘం (ECI).

2027 పంజాబ్ ఎన్నికల్లో త్రిముఖ పోరు.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

మొత్తానికి పాతమిత్రులు ఒక్కటవడంతో పంజాబ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మరి గెలుపే లక్ష్యంగా చేతులు కలిపిన BJP Akali Dal Alliance 2027లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తాయో చూడాలి.