AP Municipal Elections: కూటమిలో చిచ్చు.. పంపకాల్లో పదవుల రచ్చ!
ఆంధ్రప్రదేశ్లో వేడెక్కిన AP Municipal Elections పరోక్ష ఎన్నికల రచ్చ. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ పదవుల పంపకాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విభేదాలు.

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల పరోక్ష ఎన్నిక.
AP Municipal Election: కూటమి పార్టీలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తలపోటుగా మారాయా? పొత్తులో అసమ్మతికి తావులేదని అధినేతలు చెబుతున్నా.. ఇంటర్నల్ గా మాత్రం సీన్ వేరేలా ఉందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పట్టణ స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికలు ముగిసినప్పటికీ.. పరోక్ష ఎన్నికల రచ్చ మాత్రం అగ్గి రాజేస్తోంది! ప్రజలు నేరుగా ఓటు వేసి మేయర్లు, ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆల్రెడీ ఎన్నుకున్నారు. కానీ డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ పదవుల ఎంపికలోనే అసలు పరీక్ష మొదలైంది. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను ఈ పరోక్ష ఎన్నికలు ఒక్కసారిగా రోడ్డుపైకి తెచ్చాయి. దీంతో కూటమిలో కల్లోలం మొదలైంది.
AP Municipal Elections: పరోక్ష ఎన్నికల్లో అసలు పరీక్ష.. 13 చోట్ల వాయిదా!
రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి మేయర్, చైర్ పర్సన్ ల ఎంపిక కూడా పూర్తయింది. కానీ ఆ తరువాత కీలకమైన డిప్యూటీ మేయర్, వైస్ చైర్ పర్సన్ ల ఎంపికతోనే కూటమి పార్టీలకు అసలు పరీక్ష ఎదురవుతోంది. రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థలకు గాను ఇప్పటికే 87 చోట్ల పరోక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 13 చోట్ల కోరం లేకపోవడం, కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వంటి కారణాలతో పెండింగ్ లో పడ్డాయి. పలాస-కాశీబుగ్గ, ఎలమంచిలి, నర్సీపట్నం సహా 13 పట్టణాల్లో 23న జరగాల్సిన పరోక్ష ఎన్నిక 24కు వాయిదా పడింది. ఈ పరోక్ష ఎన్నికల ప్రక్రియలో మున్సిపల్ చట్టం ప్రకారం (MP Municipal Election).. ప్రజలు నేరుగా ఎన్నుకున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు కలిసి తమలో ఒకరిని డిప్యూటీ మేయర్ లేదా వైస్ ఛైర్పర్సన్గా ఎన్నుకుంటారు. ఇందులో సాధారణ ప్రజల ప్రమేయం ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మరియు అధికారిక వివరాల కోసం సందర్శించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC).
రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అధికారాన్ని పంచుకునేందుకు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్ఠానాలు పొత్తు ధర్మాన్ని పాటించాయి. అందులో భాగంగానే టీడీపీకి 66, జనసేనకు 23, బీజేపీకి 9 డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ పదవులను కేటాయిస్తూ జాబితా విడుదల చేశాయి. విశాఖ, గుంటూరు, తిరుపతి, మచిలీపట్నం కార్పొరేషన్లలో టీడీపీ మేయర్లు ఉండగా, డిప్యూటీ మేయర్ పదవులను జనసేనకు ఇచ్చారు. కర్నూలు, నెల్లూరు కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్ పీఠాలను బీజేపీకి కేటాయించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధినేతల నిర్ణయాలు తలకిందులయ్యాయి.
AP Municipal Elections: పిఠాపురంలో భగ్గుమన్న అసమ్మతి..
పిఠాపురం, నిడదవోలు, ఉయ్యురు వంటి చోట్ల కూటమిలోని లుకలుకలు స్పష్టంగా బయటకు వచ్చాయి. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజక వర్గంలో మొత్తం 36 వార్డులకు గాను కూటమికి 25 మంది సభ్యుల బలముంది. అయితే ఇందులో ఒక్క జనసేనకే 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో వైస్ ఛైర్పర్సన్ పదవి కోసం బొజ్జ వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేసింది జనసేన అధిష్టానం. ఇక్కడే అగ్గి రాజుకుంది! సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి జనసేనలో చేరిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారంటూ మెజారిటీ కౌన్సిలర్లు భగ్గుమన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన పిండి సంధ్యకు ఆ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. బొజ్జ వెంకటేశ్వరరావు ఎంపిక వెనుక కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రమేయం ఉందంటూ అసమ్మతి వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపింది. చివరకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి, పార్టీ విప్ జారీ చేసి కౌన్సిలర్లను బుజ్జగించడంతో బొజ్జ వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరిన్ని రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాల కోసం చూడండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు.
మంటగలిసిన పొత్తు ధర్మం..
పిఠాపురంలో ఇలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏకంగా పొత్తు ధర్మమే మంటగలిసింది! కూటమి ఒప్పందం ప్రకారం నిడదవోలు వైస్ ఛైర్పర్సన్ పదవిని టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుకు కేటాయించారు. సాక్షాత్తూ జనసేన మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. కానీ, ఎన్నిక సమయానికి సీన్ రివర్స్ అయింది. జనసేన కౌన్సిలర్ తోపరాల కల్యాణ చక్రవర్తి అనూహ్యంగా బరిలోకి దిగారు. జనసేనకు చెందిన 15 మంది, బీజేపీ (1) సభ్యులతో పాటు, అనూహ్యంగా వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఆయనకే మద్దతు పలకడంతో కల్యాణ చక్రవర్తి గెలుపొందారు. వైసీపీ మద్దతుతో కూటమి అభ్యర్థిని ఓడించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కృష్ణా జిల్లా ఉయ్యూరులో అయితే పరిస్థితి మరి దారుణం. వైస్ ఛైర్పర్సన్ పదవి తమకంటే తమకే దక్కాలంటూ సభా ప్రాంగణంలోనే జనసేనకు చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరులోను, ప్రకాశం జిల్లా మార్కాపురంలోను ఇలాంటి పరిస్థితులే కనిపించాయి.
AP Municipal Elections రచ్చపై కూటమి పెద్దల రియాక్షన్ ఏంటి?
ఇలా ఓవరాల్ గా చాలా చోట్ల అధిష్టానం నిర్ణయాలను తుంగలో తొక్కి స్థానిక నేతలు రచ్చకెక్కడం.. పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఎవరికీ వారు పదవులపై కన్నేస్తే.. కూటమి ఐక్యత దెబ్బ తింటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరి ఈ స్థానిక రచ్చపై కూటమి పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
