AP MPTC ZPTC RESULTS: పరిషత్ ఎన్నికల ఫలితాలు 2026 🔴లైవ్

AP mptc zptc results నేడు వెలువడనున్నాయి. నవంబర్ 5న 582 జడ్పిటిసి స్థానాలకు, 7767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగా.. ఇవాళ ఫలితాలు తేలనున్నాయి.

AP mptc zptc results 2026 live

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం

🔴 AP పరిషత్ ఎన్నికల ఫలితాలు – లైవ్ ఫలితాల సరళి

*తాజా ఫలితాల కోసం పేజీని రీఫ్రెష్ చేయండి / ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి

AP mptc zptc election results: తేలిపోనున్న ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజాతీర్పు శనివారం వెలువడనుంది. ఎన్నికల బరిలో నిలిచిన 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించారు. వీటిలో 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల గెలుపోటములు ఓట్ల లెక్కింపు అనంతరం స్పష్టంకానున్నాయి.