Vijayasai Reddy: ‘జగన్ నన్ను ఘోరంగా అవమానించారు!’
Vijayasai Reddy జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో అవమానాలు, పొమ్మనకుండా పొగబెట్టారన్న వ్యాఖ్యలు..

వైఎస్ జగన్‌పై విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూ నాయకుడిగా, వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన మాజీ ఎంపీ వై విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను ఎప్పుడూ వైఎస్సార్సీపీని వీడాలని అనుకోలేదని, కానీ పార్టీలో తనను పొమ్మనకుండా పొగబెట్టి బయటకు పంపించారని ఆయన మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో విధేయతతో పనిచేసినప్పటికీ తన చుట్టూ ఒక రాజకీయ ఉచ్చు బిగించారని, స్వయంగా వైఎస్ జగన్ నుంచి కూడా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆయన బాహాటంగానే వాపోయారు. ఒకప్పుడు ఆప్తమిత్రులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఇంతటి వైరం ఎలా మొదలైందనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
(రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీల అంతర్గత పరిణామాలు మరియు నిష్పాక్షిక రాజకీయ విశ్లేషణల కోసం పాఠకులు నిరంతరం వీక్షించండి: MK News Telugu.)
Vijayasai Reddy ఆరోపణ జగన్ చుట్టూ కోటరీ..
గత 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ ఘోర పరాజయం చవిచూడటంతో విజయసాయిరెడ్డి, జగన్ మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. పార్టీ ఓటమికి గల కారణాలు, క్షేత్రస్థాయి నాయకత్వం విషయంలో జగన్ వ్యవహరించిన తీరుపై అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, పార్టీలో తనకు జరిగిన అవమానాల గురించి ప్రస్తావిస్తూ.. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపించారు. చివరకు పార్టీని వీడక తప్పని పరిస్థితులను కల్పించారని పేర్కొన్నారు.
మొదట్లో ఆయన పార్టీని వీడినప్పుడు పరోక్ష విమర్శలకే పరిమితమైనప్పటికీ, రానురాను నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తనను నమ్మిన వారిని దూరం చేసుకుంటున్నారని, నియంతృత్వ ధోరణితో పార్టీని భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపణలు గుప్పించడం వైసీపీ క్యాడర్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.
Vijayasai Reddy కొత్త పార్టీ ఏర్పాటు: నవంబర్ 11న అధికారిక ప్రకటన
ఈ విమర్శల పర్వంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, విజయసాయిరెడ్డి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడం. ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడ వేదికగా తన నూతన రాజకీయ పార్టీ పేరు, విధివిధానాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, అటు వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన మూడో శక్తిగా ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెబుతున్నారు. అయితే పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న అంతర్గత చర్చల ప్రకారం, ఈ పార్టీ ప్రధాన లక్ష్యం రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ఓటు బ్యాంకును చీల్చడమేనన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. ఏది ఏమైనా ప్రతి విజయసాయిరెడ్డి సంధచిన రాజకీయ వస్త్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే వైయస్ జగన్ హన్ రెడ్డిని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.
(పార్టీల నమోదు ప్రక్రియ, గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల మార్గదర్శకాలకు సంబంధించిన అధికారిక నిబంధనలను భారత ఎన్నికల సంఘం (Election Commission of India) అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు.)
