AP Municipal Election Results 2026: టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్, పూర్తి ఫలితాలు ఇవే!
AP Municipal Election Results 2026 విడుదలయ్యాయి. 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో కూటమి ఘన విజయం, టీడీపీ, జనసేన, వైసీపీ గెలిచిన స్థానాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కూటమి పార్టీల తిరుగులేని విజయం
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫైనల్ రిపోర్టు వచ్చేసింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పార్టీలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అన్నిచోట్ల కూడా ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉండడంతో కూటమి శ్రేణుల్లో, సంబరాలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో (AP Municipal Election Results 2026) ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచి ప్రభంజనం సృష్టించగా, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురైంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయారు. ఇప్పుడు అధికారికంగా వెల్లడైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు కార్పొరేషన్ల వారీ పూర్తి ఫలితాల వివరాలను పరిశీలిద్దాం.
Read also: AP municipal election result: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Election Result 2026: కూటమి ప్రభంజనం
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఛైర్పర్సన్ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఇందులో పోలింగ్‌కు ముందే 17 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 70 స్థానాలకు హోరాహోరీగా పోలింగ్ జరిగింది. ముందస్తు ఏకగ్రీవాలతో కలుపుకుని చూస్తే తెలుగుదేశం పార్టీ ఏకంగా 59 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 18 పురపాలికలను కైవసం చేసుకుని తన తిరుగులేని బలాన్ని నిరూపించుకుంది. భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు. అయితే తీర ప్రాంతంలో సంభవించిన తీవ్ర తుఫాన్ కారణంగా చీరాల మున్సిపాలిటీ ఫలితం మాత్రం నిలిచిపోయింది.
కార్పొరేషన్లలోనూ కూటమి జోరు: 9 మేయర్ పీఠాలు టీడీపీ కైవసం
నగరపాలక సంస్థలైన 13 మేయర్ పీఠాల్లోనూ కూటమి భారీ ఆధిక్యతను సుస్థిరం చేసుకుంది. మొత్తం 13 కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ 9 మేయర్ స్థానాలను సొంతం చేసుకుని రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. జనసేన పార్టీ 2 మేయర్ స్థానాలను చేజిక్కించుకుని పట్టణ ప్రాంతాల్లో తమ పట్టును చాటుకోగా, వైఎస్సార్సీపీ కేవలం ఒకే ఒక్క కార్పొరేషన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు కార్పొరేషన్ ఫలితం అధికారికంగా వెల్లడి కానప్పటికీ, అక్కడ టీడీపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గత మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి పట్టణ ఓటర్లు కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో పట్టం కట్టారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యం, రోడ్ల అభివృద్ధి మరియు తాగునీటి సరఫరా వంటి కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ప్రజలు కూటమి వైపు నిలిచారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు కూటమి అభ్యర్థులకే ఏకపక్షంగా మద్దతు పలకడం ఈ ఫలితాల్లో (AP municipal election results 2026) స్పష్టంగా కనిపించింది.
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల వారీ ఓట్ల మెజార్టీ మరియు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP State Election Commission) అధికారిక పోర్టల్‌ను నేరుగా సందర్శించవచ్చు.
