AP Panchayat Elections: జగన్‌కు ఏకగ్రీవాల భయం పట్టుకుందా!

ఆంధ్రప్రదేశ్‌లో వేడెక్కిన AP Panchayat Elections రాజకీయం. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం.. చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహమేంటి?

AP Panchayat Elections Unanimous Strategy Kutami vs YSRCP

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై కూటమి ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు వైసీపీ ప్రతివ్యూహాలపై విశ్లేషణ.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (AP Panchayat elections) నగర మోగింది. ఇప్పటికే స్థానిక, పరిషత్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎన్నికల హీట్ మొదలైంది. మేరీ జాక్సన్ పంచాయతీ ఎలక్షన్స్ లో పల్లె ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలో సిద్ధమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన కూటమి పల్లె పోరులో కూడా విజృంభించాలని చూస్తోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. పరిషత్ ఎన్నికల్లో పరాభవం.. ఇక మిగిలింది పంచాయతీలే. కనీసం ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీలైనన్ని పంచాయతీలను ఖాతాలో వేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ఆ పార్టీని ఏకగ్రీవాలు కలవర పెడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ, పరిషత్ ఎన్నికల్లోను భారీగా దెబ్బ తీసిన ఏకగ్రీవాలు.. AP Panchayat Elections లో కూడా దెబ్బేస్తే? వైసీపీ పరిస్థితి ఏంటి? ఏకగ్రీవాలను ఎదుర్కోవడానికి అధినేత అనుసరిస్తున్న వ్యూహాలేంటి?

 

● ADVERTISE WITH MK NEWS TELUGU
మీ వ్యాపారం & బ్రాండ్ ప్రమోషన్ కోసం Banner Ads కేవలం ₹99/- మాత్రమే!
వేలాది మంది తెలుగు పాఠకులకు మీ బిజినెస్‌ను నేరుగా చేరువ చేయండి.
Book Now

మూడు విడతల్లో AP Panchayat Elections: షెడ్యూల్ మరియు నామినేషన్ల వివరాలు

రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికలతో హోరెత్తిపోయిన రాష్ట్రం.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎస్ఈసీ ఇప్పటికే ప్రకటించగా.. తొలి విడత ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. అలాగే 29 రెండో విడత, డిసెంబర్ 2 మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడతకు సంబంధించి 15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ, రెండో విడత 16 నుంచి 20 వరకు, అలాగే మూడో విడతకు 19 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. దీంతో ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అభ్యర్థులు కూడా నువ్వా నేనా అంటూ సమరానికి సిద్ధమవుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల మధ్య ఈ AP Panchayat Elections కీలకంగా మారాయి. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి పార్టీలు.. పంచాయతీల్లో కూడా విజృంభించాలని చూస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి.

Read also: YS Jagan: జగన్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత!

ఏకగ్రీవ పంచాయతీలకు కూటమి ప్రభుత్వ భారీ నగదు ప్రోత్సాహకాలు

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్న కూటమి పార్టీలు.. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలే టార్గెట్ గా వ్యూహరచన చేస్తున్నారు అధినేతలు. అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గ్రామాల్లో రాజకీయ కక్షలు తగ్గించి, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చే ఉద్దేశంతో జనాభా ప్రాతిపదికన నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది:

  • 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలు: ఏకగ్రీవమైతే రూ.15 లక్షల నగదును అభివృద్ధి పనుల కోసం దశలవారీగా ప్రభుత్వం అందజేస్తుంది.
  • 10,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలు: ఈ కేటగిరీ గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైతే రూ.25 లక్షల ప్రత్యేక నిధులు లభిస్తాయి.
  • 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న మేజర్ పంచాయతీలు: ఇక్కడ ఏకగ్రీవం సాధిస్తే ఏకంగా రూ.50 లక్షల భారీ ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్లు కూడా పూర్తిస్థాయిలో ఏకగ్రీవమైతేనే ఈ నగదు వర్తిస్తుందంటూ ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో గ్రామాల్లో అభివృద్ధి నిధులపై ఆశతో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు అయినా ఆశ్చర్యం లేదు. మరిన్ని స్థానిక సంస్థల రాజకీయ సమీకరణాల కోసం ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు పరిశీలిస్తే, గ్రామీణ ఓటర్ల నాడి ఎలా మారుతోందో స్పష్టమవుతోంది.

 

పులివెందుల అనుభవంతో అప్రమత్తమైన వైసీపీ.. జగన్ కొత్త వ్యూహం

మరోవైపు ఏకగ్రీవాలు అవకుండా.. కచ్చితంగా ఎన్నికల నిర్వహణ జరగాలని వైసీపీ భావిస్తోంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కారణంగా.. ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. స్వయంగా అధినేత జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల సైతం కూటమి ఖాతాలో ఏకగ్రీవమైంది. ఇలా వైసీపీ బలమున్న చాలా చోట్ల కూటమి ఏకగ్రీవాలు చేసుకోగలిగింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు లేదా ప్రలోభాలకు తలొగ్గి క్షేత్రస్థాయిలో అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీ అధిష్ఠానం అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఈ ఏకగ్రీవాలకు చెక్ పెట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే గ్రామస్థాయి లీడర్లను సమన్వయం చేసుకోవడానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు స్పష్టమైన సందేశాలు కూడా పంపారు. ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు అభ్యర్థులకు పార్టీ అండగా నిలవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకూడదని వైసీపీ పట్టుదలతో ఉంది.

 

పల్లె పోరులో అసలు సవాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు (AP Panchayat elections) పార్టీ గుర్తులపై జరగకపోయినా, క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల బలాబలాలకు ఇవి నిజమైన పరీక్షగా నిలుస్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఎవరైనా అభ్యర్థులను బెదిరించి లేదా బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక ఎన్నికల షెడ్యూల్ మరియు నిబంధనల వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నారు.

ఒకవైపు అభివృద్ధి నిధుల ఆశ చూపుతూ ఏకగ్రీవాల వైపు నడిపిస్తున్న కూటమి వ్యూహం, మరోవైపు పోటీలో నిలిచి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్న వైసీపీ పట్టుదల మధ్య గ్రామీణ రాజకీయం రసవత్తరంగా మారింది. మరి పల్లె ప్రజలు కూటమి ఆశిస్తున్నట్లుగా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతారా? లేదా వైసీపీ కోరుతున్నట్లుగా ఎలక్షన్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తారా? అనేది వేచి చూడాలి.