Bisleri Water Controversy: బాబోయ్ బిస్లరీ.. నీరు కాదు విషం?..సంచలన నిజాలు!

వినియోగదారులను కలవరపెడుతున్న Bisleri Water Controversy. గోవా ప్లాంట్ నమూనాపై FSSAI ల్యాబ్ నివేదికలో ఏం తేలింది? బిస్లరీ సంస్థ వివరణ ఏంటి? పూర్తి వివరాలివే.

Bisleri Water Controversy and FSSAI Lab Report Goa Plant News

బిస్లరీ ప్లాంట్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాపై FSSAI ల్యాబ్ నివేదిక

  1. Bisleri Water Controversy: మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా హోటల్స్‌లో ఏదైనా తినేటప్పుడు, ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు.. ఇలా సందర్భం ఏదైనా.. శుభకార్యం ఎప్పుడైనా.. మనకు మంచినీళ్లు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు బిస్లరీ. సామాన్యుడి నుంచి ధనికుల వరకు ఎవరైనా కొనుగోలు చేసే ఏకైక బ్రాండ్ బిస్లరీ.. అలాంటి బిస్లరీ వాటర్ ఇప్పుడు విషంగా మారిందా? ఫుడ్ సేఫ్టీ నివేదికలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయా? ఇన్నాళ్లు మనం తాగిన బిస్లరీ వాటర్.. ప్రాణాలకే ముప్పయిందా? అసలు బిస్లరీ వాటర్ లో ఏముంది? ఎందుకంత ప్రమాదకరంగా మారింది? బిస్లరీ వాటర్ పై వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు…

 

Bisleri Water Controversy: గోవా ప్లాంట్‌లో FSSAI తనిఖీలు.. 6వ నమూనాలో ఏం తేలింది?

“బిస్లరీ అంటేనే స్వచ్ఛతకు మారుపేరు” అని దశాబ్దాలుగా మనం నమ్ముతున్నాం. ఇంటి నీళ్ల కంటే బాటిల్ వాటర్ సేఫ్ అనుకుని, రూపాయి ఎక్కువా అయినా సరే కొని తాగుతున్నాం. మరి అంత నమ్మకంగా భావించే ఆ బిస్లరీ వాటర్ బాటిల్‌లో.. ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని, క్యాన్సర్ కారకాలు బయటపడ్డాయని స్వయంగా భారత ప్రభుత్వ ఆహార భద్రతా సంస్థ FSSAI ప్రకటిస్తే మీ రియాక్షన్ ఏంటి?.. ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అవుతుంది కదూ. ఎందుకంటే స్వచ్ఛతకు మారుపేరుగా భావించే బిస్లరీ వాటరే క్యాన్సర్ కు దారి తీస్తుందని తెలిశాక కచ్చితంగా ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. దీని వెనకున్న అసలు వివరాల్లోకి వెళితే.. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ, అంటే FSSAI అధికారులు గోవాలోని బిస్లరీ ప్లాంట్‌లో సాధారణ తనిఖీలకు వెళ్లారు.

ఆ తనిఖీల్లో భాగంగా, అక్కడ తయారవుతున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల నుంచి మొత్తం 6 శాంపిల్స్ సేకరించి, ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులకు దిమ్మతిరిగిపోయింది. ఆ 6 నమూనాల్లో 5 నమూనాలు అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. కానీ.. ఆ 6వ నమూనాలో తేలిన విషయంతో కంగుతిన్నారు అధికారులు. అసలు ఆ ఆరో రిపోర్టులో ఏం తేలిందంటే నీటిలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో ‘బ్రోమేట్’ (Bromate) రసాయనం ఉన్నట్లు ఆ ప్రాథమిక పరీక్షల్లో బయటపడింది. నిబంధనల ప్రకారం, ఒక లీటరు నీటిలో బ్రోమేట్ పరిమితి గరిష్టంగా 10 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలి. కానీ, బిస్లరీకి చెందిన ఆ శాంపిల్‌లో అది 12 మైక్రోగ్రాములు ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. మరిన్ని తాజా జాతీయ మరియు వినియోగదారుల ఆరోగ్య వార్తల కోసం చూడండి తెలుగు తాజా వార్తలు.

● ADVERTISE WITH MK NEWS TELUGU
మీ వ్యాపారం & బ్రాండ్ ప్రమోషన్ కోసం Banner Ads కేవలం ₹99/- మాత్రమే!
వేలాది మంది తెలుగు పాఠకులకు మీ బిజినెస్‌ను నేరుగా చేరువ చేయండి.
Book Now

Read also: Mahesh Babu Rajamouli Movie: ఏప్రిల్ 7 రిలీజ్ కాదు.. కొత్త డేట్ ఇదే!

 

 లేబొరేటరీ పరీక్షల్లో అసలు ట్విస్ట్!

ఒక పేరు మోసిన బ్రాండ్.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా చేయడం ఏంటని.. అందరు ఆశ్చర్యానికి లోనయ్యే పరిస్థితి. ఒకింత భయానికి గురి చేసే వార్త అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఆరో ప్రాథమిక ల్యాబ్ రిపోర్ట్‌ను బిస్లరీ కంపెనీ ఒప్పుకోలేదు. “మా ప్లాంట్‌లో అత్యున్నత ప్రమాణాలు ఉన్నాయని, ఆ రిపోర్టు సరికాదంటూ నవంబర్ 22, 2025న బిస్లరీ కంపెనీ అధికారికంగా అప్పీల్ చేసుకుంది. నిబంధనల ప్రకారం, ఏదైనా ఒక కంపెనీ అప్పీల్ చేసుకున్నప్పుడు ఆ శాంపిల్‌ను అత్యున్నత స్థాయి రిఫరల్ ఫుడ్ లేబొరేటరీకి పంపిస్తారు. అక్కడ ఇచ్చే రిపోర్టే ఫైనల్!

ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఈసారి వచ్చిన రిపోర్టుతో అధికారులకే కాదు కంపెనీ యాజమాన్యానికి సైతం మైండ్ బ్లాక్ అయింది. రిఫరల్ ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో.. మొదటి ల్యాబ్ చెప్పిన ‘బ్రోమేట్’ స్థాయి పరిమితిలోనే ఉందని తేలింది. కానీ ఇంతటితోనే అయిపోలేదు.. అదే నీటిలో అంతకంటే ప్రమాదకరమైన మరో రసాయనం ఉన్నట్లు రిఫరల్ ల్యాబ్ గుర్తించింది. దాని పేరే.. పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. దీంతో బిస్లరీ బ్రాండ్ ఇమేజ్ తలకిందులైంది. దీంతో ఆ నివేదిక ఆధారంగా ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ఆ నీటి నమూనా సురక్షితం కాదని ప్రకటిస్తూ తాజాగా బిస్లరీ కంపెనీపై FSSAI చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతినిచ్చింది.

 

Bisleri Water Controversy పై సంస్థ వివరణ ఏంటి?

అయితే ఈ మొత్తం వివాదంలో బిస్లరీ వాదన మరోలా ఉంది. “మొదటి ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు బ్రోమేట్ ఎక్కువగా ఉందని చెప్పిన నివేదిక.. అదే నీటిని రిఫరల్ ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు బ్రోమేట్ నార్మల్‌గానే చెప్పడం ఏంటని బిస్లరీ సంస్థ ప్రశ్నిస్తోంది. అలాగే మొదటి ల్యాబ్‌లో లేని PAHs, రెండో ల్యాబ్‌లో ఎలా వచ్చాయి? అంటూ నిలదీస్తోంది. దీంతో ఎవరి వాదన వాస్తవమో తెలియక తలలు పట్టుకుంటున్నారు వినియోగదారులు. అయితే ప్రస్తుతం చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చింది కేవలం గోవా ప్లాంట్‌లో సెప్టెంబర్ 2025న సేకరించిన ఒక నిర్దిష్ట బ్యాచ్ ‘ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్’ కు సంబంధించినది మాత్రమే.

బిస్లరీ విక్రయించే ‘మినరల్ వాటర్’ ఉత్పత్తులకు గానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్లాంట్ల ఉత్పత్తులకు గానీ ఇది వర్తించదు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రాసిక్యూషన్ కు సంబంధించి తమకెలాంటి అధికారిక నోటిస్ అందలేదని బిస్లరీ చెబుతోంది. “తాము తాగునీటి భద్రతకే మొదటి ప్రాధాన్యమిస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని, 10 దశల ప్రక్రియలో 90 నాణ్యత ప్రక్రియలు పూర్తయిన తరువాతే వాటర్ బయటకు వస్తుందని తెలిపింది. అయినప్పటికీ.. FSSAI విచారణకు పూర్తిగా సహకరిస్తామని బిస్లరీ సంస్థ తెలిపింది. ఆహార భద్రత ప్రమాణాలు మరియు అధికారిక మార్గదర్శకాల కోసం సందర్శించండి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI).

వినియోగదారుల ఆరోగ్యం.. నాణ్యతపై పెరిగిన ఆందోళన

మొత్తానికి.. మనం తాగే బిస్లరీ వాటర్ ఇప్పుడు వార్తల్లో నిలవడం నిజంగా కలవరానికి గురిచేసే విషయమే. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో Bisleri Water Controversy నేపథ్యంలో నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సామాన్యులు సూచిస్తున్నారు.