AP Gram Panchayat Elections: కూటమికి షాక్ ఇచ్చిన జనసేన!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన AP Gram Panchayat Elections. పంచాయతీల్లో ఎలాంటి సీట్ల పంపకాల్లేవని జనసేనని ప్రకటన.

AP Gram Panchayat Elections Pawan Kalyan Jana Sena No Seat Sharing Announcement

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై రాజకీయ చర్చ

AP Gram Panchayat Elections: పంచాయతీల్లో పంపకాల్లేవ్.. బరిలో దిగండి.. పోటీచేయండి! ఎవరైనా అడ్డగిస్తే ఫిర్యాదు చేయండి! ఇవి ఎవరో చేసిన కామెంట్స్ కాదు.. పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రెస్ నోట్ లో చేసిన వ్యాఖ్యలు. పురపాలక, నగర పాలక, పరిషత్ ఎన్నికల్లో మాదిరి ఎలాంటి పంపకాలు లేవని.. జనసేన పార్టీ తరపున ఎవరైనా పోటీ చేయొచ్చని అధినేత ఫ్రీడమ్ ఇవ్వడం.. ప్రజెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. అంటే పంచాయతీల్లో పొత్తు లేదా? ఒకవేళ ఉంటే జనసేనాని ఇచ్చిన ఫ్రీడమ్ వెనకున్న రీజన్ ఏంటి?

AP Gram Panchayat Elections: మున్సిపల్, పరిషత్ ఎన్నికల తర్వాత మారిన సీన్

2014 సార్వత్రిక ఎన్నికల టైంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులో భాగమైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కనివిని ఎరుగని విజయఢంకా మోగించాయి ఈ కూటమి పార్టీలు. ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టైంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలు ఎలా ఉండనున్నాయి? మూడు పార్టీల్లో ఎలాంటి అసమ్మతులు చెలరేగకుండా సర్దుబాటు ఎలా జరుగుతుంది అనే చర్చ జరిగింది. అనుకున్నట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ, పరిషత్ ఎన్నికల్లోనూ సీట్ల సర్దుబాటులో మూడు పార్టీల మధ్య కొంత ప్రతిష్టంభన ఎదురైంది. అయినప్పటికీ సమన్వయముతో ఒక పార్టీలో ఉన్న అభ్యర్థి బరిలో ఉంటే మరో రెండు పార్టీల అభ్యర్థులు తప్పని సరిగా మద్దతుగా నిలవాలని, పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలని అధినేతలు క్లియర్ ఇండిగేషన్ ఇవ్వడంతో.. లోకల్ లీడర్స్ లోలోపల ఎలా ఉన్నా.. ఓవరాల్ గా కూటమి విజయానికి కృషి చేశారు.

● ADVERTISE WITH MK NEWS TELUGU
మీ వ్యాపారం & బ్రాండ్ ప్రమోషన్ కోసం Banner Ads కేవలం ₹99/- మాత్రమే!
వేలాది మంది తెలుగు పాఠకులకు మీ బిజినెస్‌ను నేరుగా చేరువ చేయండి.
Book Now

Read also: Jagan vs Sharmila: అన్నాచెల్లెళ్ల వైరం.. వెనకున్న చీకటి కోణం!

AP Gram Panchayat Elections లో ఎలాంటి సర్దుబాట్లు లేవన్న జనసేన

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పంచాయతీ ఎలక్షన్స్ కు వచ్చే సరికి.. పరిస్థితి మరోలా మారిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో అటు టీడీపీ గాని, ఇటు జనసేన, బీజేపీ గాని.. అభ్యర్థుల ఎంపికపై గాని, పొత్తుకు ధర్మానికి సంబంధించిన అంశాన్ని గాని పెద్దగా నొక్కి చెప్పలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో మూడు పార్టీల ప్రమేయం ఉంటుందేమోనని భావించారంతా. తాజాగా జనసేన పార్టీ చేసిన ప్రకటనతో ఎవరికీ వారే అన్నట్లుగా బరిలో దిగనున్నారా.. అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సీట్ల కేటాయింపులు లేవని, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో మాదిరి ఎలాంటి సర్దుబాట్లు లేవని.. ఎవరైనా పోటీ చేయొచ్చు అంటూ ఆ పార్టీ అధికారికంగా తెలిపింది.

(మరిన్ని రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాలు మరియు ఎన్నికల సమీకరణాల కోసం చూడండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు.)

పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్‌లోని కీలక అంశాలు.. ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు

ఈ ప్రకటనకు సంబంధించిన అదనపు వాస్తవ వివరాలను పరిశీలిస్తే, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో కాకుండా పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో జరిగేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్‌లో స్పష్టం చేశారు. సర్పంచ్ మరియు వార్డు మెంబర్ స్థానాల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి:

  • అందరికీ స్వేచ్ఛ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు వేయవచ్చని అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
  • నాయకులకు స్పష్టమైన ఆదేశం: బరిలో నిలవాలనుకునే పార్టీ శ్రేణులను జనసేన నాయకులు ఎవరూ అడ్డుకోరాదని కీలక ఆదేశాలు జారీ చేశారు.
  • ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు: నామినేషన్ల దాఖలు సమయంలో లేదా ఎన్నికల ప్రక్రియలో జనసేన అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించి పరిష్కరించడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షణలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు అండగా నిలవనుంది.

మరోవైపు, మూడు దశల్లో జరుగుతున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ పోలింగ్ నవంబర్ 26న జరగనుండటంతో గ్రామాల్లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు, షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ అధికారిక వివరాల కోసం సందర్శించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC).

గ్రామస్థాయిలో కూటమి సమీకరణాలపై ప్రభావం ఎలా ఉండబోతోంది?

దీంతో ఒకే పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ జనసేన అభ్యర్థి కూడా పోటీ చేయొచ్చన్నమాట. ఈ తాజా ప్రకటనతో అసలు పొత్తు ధర్మం ఏమైందనే సందేహాలు మొదలయ్యాయి. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సర్దుబాటు జరగడంతో చాలా మంది ఆశావహులకు సీట్లు దక్కలేదు. వారంతా కూడా అసమ్మతి గళం వినిపించారు. కొందరు రెబల్స్ గా బరిలోకి దిగారు కూడా. ఆ పరిణామాలు కూటమికి బాగానే డ్యామేజ్ చేశాయి. ఫైనల్ గా అధినేతలు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి.. ఎలాంటి పంపకాలు గాని సర్దుబాటుగాని లేవని.. కూటమిలోని జనసేన ప్రకటించడంతో.. గ్రామస్థాయిలో కూటమిలో చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీడీపీ, బీజేపీల తదుపరి అడుగు ఏంటి?

ఈ పరిణామం పంచాయతీ ఎన్నికల వరకే అయితే సరేసరి. కానీ ఎవరికీ వారే అన్నట్లుగా మున్ముందు కూడా వ్యవహరిస్తే పొత్తు ధర్మం ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. మరి AP Gram Panchayat Elections లో జనసేన వైఖరి పట్ల టీడీపీ, బీజేపీ లు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి.