IND vs WI 3rd T20: ఢీ.. పైచేయి ఎవరిదో?
IND vs WI 3rd T20 మ్యాచ్ ఇవాళ ఇండోర్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ రోజుల్లో చెరువు మ్యాచ్ విజయంతో సమానంగా నిలిచాయి. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. సిరీస్‌లో పైచేయి సాధించేందుకు కీలకమైన మూడో టీ20 (IND vs WI 3rd T20) నేడు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. సొంతగడ్డపై భారత్‌కు విండీస్ గట్టి పోటీ ఇస్తుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బ్యాటర్లకు స్వర్గధామం.. ఇండోర్ పిచ్ రిపోర్ట్ (Pitch Report):
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్‌కి పెట్టింది పేరు. ఇక్కడ బౌండరీల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.యావరేజ్ స్కోర్: ఈ గ్రౌండ్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు ఏకంగా 200 పరుగులుగా ఉంది.భారత్ ట్రాక్ రికార్డ్: ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు 4 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట్లో ఘన విజయం సాధించి బలమైన రికార్డును కొనసాగిస్తోంది. టాస్ గెలిచిన జట్టు తొలుత ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
దూబే స్థానంలో నితీశ్‌కు ఛాన్స్ దక్కేనా?
ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేస్తుందా లేదా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా అనే అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.బౌలింగ్ విభాగంలో డెత్ ఓవర్ల ప్రదర్శన మరింత మెరుగుపడాల్సి ఉంది. మరోవైపు విండీస్ జట్టు తమ భారీ హిట్టర్లతో భారత్‌ను కట్టడి చేసే వ్యూహంతో బరిలోకి దిగుతోంది.
ఇక రెండో టి20లో 249 భారీ పరుగులను చేజ్ చేసి గెలిచిన విండీస్.. మూడో మ్యాచ్‌లో కూడా అంతే స్థాయిలో విజృంభించి ఆదిత్యం ప్రదర్శించాలని చూస్తోంది. ముఖ్యంగా హోప్ (hope) మూడో మ్యాచ్‌లో కూడా చెలరేగితే వెస్టిండీస్ జట్టును ఆపడం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
