Jensen Huang Nvidia: ఒక అమ్మాయి వల్ల టెక్ సామ్రాజ్యాధినేత పతనం!
5 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన Jensen Huang Nvidia సీఈఓ పదవికి ఎందుకు ముప్పు వచ్చింది? తెర వెనుక నిజాలు..

టెక్ దిగ్గజం ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాదం,
ఆయన ప్రపంచ టెక్ సామ్రాజ్యాన్ని శాసించిన రారాజు (Jensen Huang Nvidia).. 5 ట్రిలియన్ డాలర్ల కంపెనీని నిర్మించిన విజనరీ.. ఏఐ ఆధారిత సంస్థలకు అతడో రోల్ మోడల్.. కట్ చేస్తే ఇప్పుడతన్ని సొంత కంపెనీ నుంచే గెంటేయాల్సిన పరిస్థితి. అతడి వల్ల కేవలం రెండు రోజుల్లోనే 450 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి. ప్రపంచ కుబేరుల లిస్ట్ లో టాప్ 5 నుంచి టాప్ 10కి పతనం. వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్స్ జాబితాలో ఒకరైన ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జీవితంలో అసలేం జరుగుతోంది? ఒక మహిళా అతడి సామ్రాజ్యాన్ని ఎలా పతనం చేసింది. ప్రస్తుతం అదరపాతాళానికి పడిపోయిన జెన్సన్ తిరిగి బయట పడగలడా? అసలు ఎవరి జెన్సన్ హువాంగ్?
5 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యం Jensen Huang Nvidia పతనం
ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయని, ప్రపంచాన్ని ఏలిన రాజులే నెలకొరిగారని.. పుస్తకాల్లో చదువుతుంటాం.. ఎన్నో సందర్భాల్లో వింటూవుంటాం. అయినా అలాంటి వాటిని తేలిగ్గా కొట్టిపారేస్తుంటాం.. కానీ టెక్ అధినేత జెన్సన్ హువాంగ్ (Jensen Huang) లైఫ్ చూస్తే ఆ మాటలు అక్షరాల నిజమే అనిపిస్తోంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న టెక్ సామ్రాజ్యం ఎన్వీడియా సంస్థ (Nvidia).. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి ఈ సంస్థ గుండెకాయ లాంటిది. ఈ కంపెనీ లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్క AI మోడల్ కూడా పనిచేయదు. ఎందుకంటే ఏఐ ఆధారిత మోడల్స్ అన్ని కూడా ఎన్వీడియా తయారు చేసే జీపీయూ చిప్స్ ద్వారానే రన్ అవుతాయి. అలాంటి కంపెనీకి మూలస్తంభం, 5 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన విజనరీ సీఈఓ.. ఆయనే జెన్సన్ హువాంగ్.
ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న వ్యక్తిగత వివాదాల కారణంగా ఎన్ వీడియా కంపెనీకి సంబంధించి కేవలం రెండు రోజుల్లో 450 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయింది. దింతో ఆయన సీఈఓ పదవి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే ప్రపంచాన్నే శాసించే టెక్ దిగ్గజంగా జెన్సన్ హువాంగ్ ఎలా చేరుకున్నాడు అనే విషయాన్నీ పరిశీలిస్తే.. 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ తైవాన్‌లోని తైపీలో జన్మించారు. చిన్నతనం అంతా థాయిలాండ్ లోనే గడిపిన జెన్సన్.., ఆ తర్వాత అతడి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. చిన్న వయసులోనే అమెరికాలో ఒక సాధారణ రెస్టారెంట్లో పాత్రలు కడిగే స్థాయి నుండి.. నేడు ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచే వరకు సాగిన ఆయన ప్రయాణం అనితర సాధ్యం.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, 1993లో క్రిస్ మలాచోవ్ స్కీ, కర్టిస్ ప్రీమ్లతో కలిసి ‘ఎన్వీడియా’ (Nvidia) ని స్థాపించారు. మొదట్లో కేవలం వీడియో గేమర్ల కోసం గ్రాఫిక్స్ కార్డ్స్ తయారు చేసిన ఈ కంపెనీ.. భవిష్యత్తును ముందుగానే ఊహించి AI చిప్స్ (GPUs) తయారీపై దృష్టి పెట్టింది. ఈరోజు చాట్‌జిపిటి నుండి గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలన్నీ నడవాలంటే ఎన్వీడియా చిప్స్ ఉండాల్సిందే. ఆ దెబ్బతో ఎన్వీడియా మార్కెట్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ డాలర్లను దాటి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా అవతరించింది. జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపద కూడా 150 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అటువంటి వ్యక్తి జీవితంలో ఈ వివాదాల వల్ల ఒక్కసారిగా తూట్లు పడ్డాయి.
Read also: Sonia Gandhi Autobiography: ఇందిరా గాంధీ గురించి నమ్మలేని నిజాలు!
అలిస్ హువాంగ్ వివాదం.. చైనా నిఘా సంస్థల కోణం
అక్టోబర్ చివరి వారంలో టెక్ ప్రపంచాన్ని కుదిపేసే విధంగా ఒక వార్త బయటకు వచ్చింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘మెగాస్పీడ్’ ( mega speed) అనే టెక్ సంస్థకు చెందిన అలిస్ హువాంగ్ అనే మహిళతో జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది!
జెన్సన్ హువాంగ్ (Jensen Huang Nvidia) కు సంబంధించి ఇది కేవలం ఒక వ్యక్తిగత ఎఫైర్‌తో ఆగిపోలేదు. అమెరికా నిఘా సంస్థల విచారణలో మరింత భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అలిస్ హువాంగ్ సాధారణ వ్యాపారవేత్త కాదని, ఆమె చైనా అత్యున్నత నిఘా విభాగానికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అసలే అమెరికా, చైనా దేశాలు ఉప్పు నిప్పులా ఉంటాయి. అందులోను ఇతర దేశాల సక్సస్ ఫార్ములాను మక్కికి మక్కి దింపే చైనా దేశంతో ఇలాంటి రహస్య వ్యవహారాలు నడుస్తుండడంతో అమెరికన్ గవర్నమెంట్ సీరియస్ గా పరిగణించింది. దాంతో చైనాపై అత్యంత కఠినమైన టెక్ ఆంక్షలు విధించింది. అమెరికాలో తయారయ్యే అత్యున్నత స్థాయి AI చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయడం ఆపేసింది. కానీ, ఈ గూఢచారి నెట్వర్క్ ద్వారా జెన్సన్ హువాంగ్ కంపెనీకి తెలియకుండా కొన్ని రహస్య మార్గాల ద్వారా చైనా కంపెనీలకు ఆ చిప్స్‌ను చేరవేయడంలో అలిస్ హువాంగ్ సాయం చేశారనేది నిర్ధారణ కావడంతో జెన్సన్ చిక్కుల్లో పడ్డారు.
Jensen Huang Nvidia: మరో మహిళతో సంబంధం
1985లోనే లోరీ మిల్స్ అనే మహిళను వివాహం చేసుకున్న జెన్సన్ హువాంగ్.. తన భార్యకు, కంపెనీకి నమ్మకద్రోహం చేసినట్లు అంతర్గత సంభాషణల్లో ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే, ఈ గూఢచర్యం ఆరోపణలను చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా మొదటి వివాదం తాలూకు మంటలు చల్లారకముందే, జెన్సన్ హువాంగ్ పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఎన్వీడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అయిన కింబర్లీ పావెల్ తో కూడా జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధం ఉందనే కథనాలు, అధరాలు బయటకు రావడంతో ఎన్వీడియా కంపెనీ పరువు, జెన్సన్ హువాంగ్ స్టేటస్ రెండు కూడా అదఃపాతాళానికి పడిపోయాయి.
ఈ ఏడాది మార్చిలో కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఎన్వీడియా ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ (GTC) సమయంలో.. వీరిద్దరూ ఒక హోటల్లో అత్యంత సన్నిహితంగా గడిపినట్లు కొన్ని సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు కంపెనీ అంతర్గత కమిటీ చేతికి చిక్కాయి. కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనల ప్రకారం.. ఒక కంపెనీకి సీఈఓగా ఉన్న వ్యక్తి, తన కింద నేరుగా పనిచేసే లేదా అదే సంస్థలో కీలక పదవిలో ఉన్న ఉద్యోగితో ఇలాంటి సంబంధాలు కలిగి ఉండటం తీవ్రమైన నేరం పరిగణిస్తారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్, కంపెనీ నిధుల దుర్వినియోగం లేదా రహస్యాల లీకేజీకి దారితీసే అవకాశం ఉంటుందని కార్పొరేట్ నిపుణులు భావన. అందుకే ఇలాంటి వ్యవహారాలను కార్పొరేట్ గవర్నెన్స్ తీవ్రంగా పరిగణిస్తుంది.
Jensen Huang Nvidia 450 బిలియన్ డాలర్లు ఆవిరి..
ఇలా జెన్సన్ హువాంగ్ కేంద్రంగా బ్యాక్ టూ బ్యాక్ వివాదాలు చుట్టముట్టడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగిపోయింది. ఈ వివాదాల కారణంగా కేవలం రెండు రోజుల్లోనే ఎన్వీడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి దాదాపు 450 బిలియన్ డాలర్లు ఆవిరయిపోయాయి. జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపద కూడా భారీగా కరిగిపోయింది. గతంలో టాప్ 5 రిచ్చెస్ట్ పర్సన్స్ లో ఒకరిగా ఉండే జెన్సన్.. ఇప్పుడు టాప్ 10లో కూడా స్థానం కోల్పోయాడు. ఇలా పరిస్థితి చేయి దాటడంతో ఎన్వీడియా డైరెక్టర్ల బోర్డు అత్యవసరంగా సమావేశం నిర్వహించి, కంపెనీ ప్రతిష్టను కాపాడుకోవడానికి స్వతంత్ర న్యాయ సంస్థల ద్వారా లోతైన విచారణకు ఆదేశించింది.
జెన్సన్ హువాంగ్ను తక్షణమే సీఈఓ పదవి నుండి తొలగించాలనే డిమాండ్లు బోర్డులో గట్టిగా వినిపించాయి. దీంతో ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఈ విషయాలను ముందుగానే దాచిపెట్టి ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ కొందరు వాటాదారులు అమెరికా కోర్టులో జెన్సన్ హువాంగ్ మరియు ఎన్వీడియా సంస్థపై క్లాస్ యాక్షన్ లా సూట్ దాఖలు చేశారు. అమెరికా చట్టసభ సభ్యులు కూడా స్పందించి, చైనాకు ఎన్వీడియా చిప్స్ ఎగుమతి లైసెన్సులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి వ్యక్తిగత విలాసాల కోసం సాగించిన జెన్సన్ హువాంగ్ వ్యవహారాలు.. ఇప్పుడు అతడి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు టెక్ సామ్రాజ్యంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్సించిన ఎన్ వీడియా కంపెనీని సైతం పాతాళానికి పడేశాయి. మరి వీటి నుంచి జెన్సన్ గాని, ఎన్ వీడియా కంపెనీగాని ఎలా బయట పడతాయో చూడాలి.
