NTR DRAGON: ఎన్టీఆర్ పై నీల్ అసంతృప్తి.. అసలు కారణమదే!

ఎన్టీఆర్ (jr NTR), ప్రశాంత్ నీల్ (Prashant neel) కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ రీషూట్‌కు వెళ్లనుందా? ఎన్టీఆర్ లుక్స్, అవుట్‌పుట్‌పై దర్శకుడు అసంతృప్తిగా ఉన్నారంటూ టాలీవుడ్‌లో సరికొత్త ప్రచారం.

Jr NTR and Prashanth Neel Dragon movie latest updates and reshoot buzz.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'డ్రాగన్'.

పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant neel), యంగ్ టైగర్ ఎన్టీఆర్(jr NTR) కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రాగన్’ (dragon). వీరిద్దరి కలయికలో మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా.. షూటింగ్ ఇంకా సెట్స్‌పైనే కొనసాగుతుండటం, అప్డేట్స్ కూడా అరా కోరగానే ఇస్తూ ఉండడం తప్ప ఇప్పటివరకు మేకర్స్ పెద్దగా ప్రమోషనల్ అప్‌డేట్స్ ఏవీ రివీల్ చేయలేదు. గతంలో విడుదలైన చిన్న టీజర్ గ్లింప్స్ కూడా అభిమానుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిందనే కామెంట్స్ ఫిల్మ్ నగర్‌లో వినిపించాయి.

అవుట్‌పుట్‌పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి?

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇంత ఆలస్యం కావడానికి అసలు కారణం ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకుడు ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ప్రశాంత్ నీల్ పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేరని సమాచారం. తన సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్, రగ్గడ్ లుక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే నీల్.. ‘డ్రాగన్’లో అనుకున్న ఇంపాక్ట్ రాలేదని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, లుక్స్‌లో కొన్ని మార్పులు చేసి, మరింత శక్తిమంతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం టీమ్ మళ్లీ షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుందని సమాచారం.

వచ్చే ఏడాది కూడా రిలీజ్ కష్టమేనా?

వాస్తవానికి వచ్చే ఏడాది ఈ భారీ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రశాంత్ నీల్ నిజంగానే రీషూట్ బాట పడితే.. షూటింగ్ పూర్తికావడానికి మరికొంత సమయం పట్టడం ఖాయం. ఆ తర్వాత భారీ వీఎఫ్ఎక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాగూ సుదీర్ఘ సమయం అవసరమవుతుంది. ఒకవేళ రీషూట్ నిర్ణయం ఖరారైతే వచ్చే ఏడాది కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఎన్టీఆర్ (jr NTR) అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply