Telangana Inter Board: ఇంటర్ బోర్డు రద్దు.. వెనకున్న అసలు కారణమిదే!

తెలంగాణ విద్యా వ్యవస్థలో సంచలన నిర్ణయం: Telangana Inter Board రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 2027-28 నుంచి స్కూళ్లలోనే 10+2 విద్య.

Telangana Inter Board Abolished CM Revanth Reddy 10+2 Education Policy

తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు రద్దు

తెలంగాణ విద్యా వ్యవస్థలో దశాబ్దాలుగా ఉన్న విధానానికి తెరపడింది. ఇంటర్మీడియట్ బోర్డు (Telangana Inter Board) ను పూర్తిగా ఎత్తివేస్తూ.. ఇకపై 10+2 విధానాన్ని నేరుగా పాఠశాల స్థాయిలోనే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దింతో ఒక్కసారిగా ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి? దీనివల్ల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడనుంది? పూర్తి వివరాలు..

● ADVERTISE WITH MK NEWS TELUGU
మీ వ్యాపారం & బ్రాండ్ ప్రమోషన్ కోసం Banner Ads కేవలం ₹99/- మాత్రమే!
వేలాది మంది తెలుగు పాఠకులకు మీ బిజినెస్‌ను నేరుగా చేరువ చేయండి.
Book Now

ఇకనుంచి Telangana Inter Board రద్దు పాఠశాలల్లోనే 10+2 విధానం

నవంబర్ 11న విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన హై-లెవల్ రివ్యూ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డును ఎత్తివేసి 10+2 విధానాన్ని నేరుగా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 2027-28 విద్యా సంవత్సరం నుంచే తెలంగాణలో ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పాత పద్ధతే కొనసాగినా, వచ్చే బ్యాచ్ నుంచి స్కూళ్లలోనే ఇంటర్ విద్య ప్రారంభం కానుంది.

దీంతో ఈ కొత్త విద్యావిధానం ఎలా ఎలా ఉండబోతోందనే చర్చ అందరిలోనూ మొదలైంది. ఇప్పటివరకు పదో తరగతి అయిపోగానే విద్యార్థులు స్కూల్ స్టేజ్ కి గుడ్ బై చెప్పి జూనియర్ కాలేజీలకు పరుగులు పెట్టేవాళ్ళు. కానీ ఇకపై జూనియర్ కాలేజీల వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయి పాఠశాలల్లోనే 12వ తరగతి వరకు విద్య అందుబాటులోకి వస్తుంది. దీన్ని 7+4+4 విధానం కింద.. మూడు విభాగాలుగా మార్చింది తెలంగాణ ప్రభుత్వం. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8 వరకు మాధ్యమిక విద్య, మరియు 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీగా మార్చనున్నారు.

Read also: YS Anil Reddy: ఎవరి అనిల్ రెడ్డి.. ఎందుకింత క్రేజ్!

Telangana Inter Board లో సరికొత్త విధానం వెనకున్న అసలు కారణాలు!

అయితే ఈ సరికొత్త విద్యావిధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంత సడన్ గా ఎందుకు ప్రవేశ పెడుతోంది.. దీని వెనకున్న అసలు కారణాలను ఒకసారి పరిశీలిస్తే..

సాధారణంగా పదో తరగతి అయిపోగానే చాలావరకు విద్యార్థులు పైచదువులు వెళ్లకుండా విద్యను మధ్యలోనే ఆపేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే దాదాపు 40 శాతం మంది పదో తరగతి పూర్తయిన తరువాత డ్రాప్ అవుట్ అవుతున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా బాలికలు, పేద పిల్లలే ఉన్నారట. సో.. ఈ డ్రాపౌట్ల సమస్యను తగ్గించేందుకు ఇంటర్ వ్యవస్థ కూడా స్కూల్ స్టేజ్ లోనే ఉంటే కొంతవరకైనా ఈ డ్రాపౌట్లు సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక రెండో విషయం ఏమిటంటే.. ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో అధిక మార్కులు, ఎంట్రన్స్ లంటూ పిల్లలపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై అలాంటి మానసిక ఒత్తిడి పడకుండా స్కూల్ స్టేజ్ లోనే 12వ తరగతి ప్రవేపెట్టి దానితోపాటుగా ఉపాధి ఆధారిత స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆచరణలో ప్రభుత్వం ముందున్న సవాళ్లు

అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త విద్యావిధానం ఆలోచనలో బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు (Telangana Inter Board) ను రద్దు చేయాలంటే ‘ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్ – 1971’ స్థానంలో చట్ట సవరణ చేయాలి.. ఆలా చేయాలంటే.. శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతుతో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా సానుకూలత రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఉన్నత పాఠశాలల్లో అదనపు గదులు, లాబ్స్ ఏర్పాటు, అలాగే ప్రస్తుత జూనియర్ లెక్చరర్ల సర్వీస్ రూల్స్, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టతపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే దీనిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికి తెలంగాణ విద్యా వ్యవస్థలో ఇదొక బిగ్గెస్ట్ చేంజ్ అనే చెప్పుకోవచ్చు. మరి విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి!