AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్!
AP Local Body Elections 2026 కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచన చేస్తోంది. రిజర్వేషన్ల మార్పులకు ప్లాన్-B, అభ్యర్థుల ఎంపిక, జగన్ తాజా ఆదేశాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో సుదీర్ఘ మంతనాలు:
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల పార్టీ అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో జగన్ సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా స్థానిక రాజకీయ సమీకరణాలు, కేడర్ పరిస్థితి, ప్రజాభిప్రాయంపై క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకున్న నివేదికలపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే భిన్నమైన, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని నేతలకు స్పష్టం చేశారట.
రిజర్వేషన్లు ఎలా మారినా ‘ప్లాన్-బి’ సిద్ధం:
ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ రిజర్వేషన్ల అంశంపై లోతైన చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి రిజర్వేషన్లు ఏ విధంగా మారినా తక్షణమే బరిలోకి దింపేలా ప్రత్యామ్నాయ అభ్యర్థుల (Plan-B Candidates) జాబితాను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని అధినేత సూచించారట.
నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉండి, ప్రజల్లో సానుకూల గుర్తింపు ఉన్న వ్యక్తులను అలాగే యువత, మహిళలు, పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన విశ్వసనీయమైన కార్యకర్తలకు ఈసారి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వార్డు నుంచి మేయర్ వరకు.. సమగ్ర వడపోత:
గ్రామ పంచాయతీల నుంచి నగరపాలక సంస్థల వరకు ప్రతి స్థానాన్ని కీలకమైనదే కావడంతో వార్డు, MPTC, ZPTC అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నిత్యం టచ్ ఉండాలని గట్టిగా ఆదేశాలు ఇచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల రేసు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే నాయకత్వ లక్షణాలు, క్లీన్ ఇమేజ్ ఉన్న బలమైన నాయకులను మేయర్, ఛైర్మన్ అభ్యర్థులుగా బరిలోకి దించేలా వడబోత ఉండనున్నట్లు తెలుస్తోంది.
